FbTelugu

మాజీ మంత్రి దేవినేని ఉమకు సిఐడీ నోటీసులు

కృష్ణా: సిఎం జగన్ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు కు సిఐడి నోటీసులు ఇవాళ ఉదయం అందచేసింది. కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

మీడియా సమావేశంలో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సిఐడి అధికారులు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం 10.20 గంటలకు గొల్లపూడిలోని ఉమామహేశ్వర రావు నివాసంలో నోటీసులు అందించారు. రేపు ఉదయం 10.30 గంటలకు కర్నూలు రావాలని నోటీసుల్లో సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.