FbTelugu

నకిలీ చలాన్ల కేసులో సీఐ బదిలీ

వరంగల్: వర్థన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న ఎక్సైజ్ సీఐ కరుణశ్రీని బదిలీ చేశారు. నకిలీ చలాన్ల కేసులో అడ్డంగా దొరికిపోవడంతో ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారు.

ఉన్నతాధికారుల రికార్డుల పరిశీలనలో మరో 1.05 కోట్ల విలువ గల ఫేక్ ఛాలన్లు బయటపడటంతో ఉన్నతాధికారులు కంగుతిన్నారు. మరింత లోతుగా విచారణ చేసేందుకు ఆమెను అక్కడి నుంచి వేరేచోటికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నకిలీ ఛలాన్ల వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి విచారణ తరువాత ఆమెను సర్వీసు నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.