FbTelugu

కరోనాతో సీఐ మృతి

అనంతపురం: కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ మృతి చెందారు. అనంతపురం పట్టణంలో ట్రాఫిక్ సీఐ గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన కరోనా బారిన పడ్డారు.

పరీక్షల తరువాత పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆయన ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చేయి దాటడంతో ఇవాళ ఆయన ప్రాణాలు విడిచారు. గుత్తి పట్టణంలో ఎస్ఐగా పనిచేసిన ఆయనకు సమర్థుడిగా పేరుంది.

సీఐ రాజ‌శేఖ‌ర్ మృతి ప‌ట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. పోలీసు శాఖలో తనతో కలిసి పనిచేశాడని, సమర్థుడైన అధికారి అని ఆయన గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయ‌న కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాధ‌వ్ భరోసా ఇచ్చారు.

You might also like