FbTelugu

ఏసీబీకి పట్టుబడిన సీఐ, ఏఎస్సై

రంగారెడ్డి: భూ తగాదా విషయంలో ఒక వ్యక్తి నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ ఒక సీఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్ అడ్డంగా దొరికిపోయారు.

షాబాద్ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ లు ఒకరి నుంచి ఇవాళ రూ.1.20 లక్షలు లంచం తీసుకున్నారు. అప్పటికే అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే వారి వద్దకు చేరుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
షాబాద్ పోలీసు స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన రికార్డులు స్వాధీనం చేసుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.