FbTelugu

లంచం అడిగిన సీఐ అరెస్టు

కామారెడ్డి: ఓ కేసులో రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన సీఐని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే.. జగదీష్ అనే సీఐ వద్దకు ఓ కేసులో బెయిల్ కోసం వెళ్లిన సుధాకర్ అనే వ్యక్తి నుంచి రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశాడని.. సుధాకర్ ఏసీబీని సంప్రదించి జరిగిన విషయాన్ని తెలిపాడు.

దీంతో సీఐ జగదీష్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు నిర్వహించింది. బాధితుని ఆరోపణలు నిజమని తేలడం.. ఇతర కారణాలతో సీఐని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.