FbTelugu

పోలీసు స్టేషన్లో క్రిస్మస్ వేడుకలా?: బీజేపీ

తిరుపతి: పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు జరపాలని ప్రభుత్వం ఆదేశించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ఆరోపించారు. అంటే క్రిస్టియానిజం ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు.
పోలీస్ స్టేషన్లను వేదికగా ప్రభుత్వం మత ప్రచారం ఎలా చేస్తుందన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ కార్యక్రంగా బావిస్తున్నామన్నారు.
ఇవి మానుకోపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. గుంటూరు పోలీస్ స్టేషన్ పై ఒక వర్గం వాళ్ళు దాడి చేస్తే జగన్ ప్రభుత్వం ఆ కేసుల ఎత్తేసిందన్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయాలని భావిస్తోందని చెప్పారు.

బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిపై ఇప్పటికే చర్చించాయన్నారు. ఎవరు పోటీ చేయాలనే దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. దర్గాలు కడతాం అని దేవాదాయ మంత్రి ఎలా చెబుతారు. సిగ్గుంటే.. తక్షణం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ పార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాలతో రాష్ట్రంలో నోటుకోచ్చినట్లు మాట్లాడుతున్నారు. సీఎం జగన్ ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.