FbTelugu

యువతిని వేధించిన కొరియోగ్రాఫర్ అరెస్టు

హైదరాబాద్: ప్రేమించిన యువతి పట్టించుకోకపోవడంతో సోషల్ మీడియాలో తప్పుడు ఖాతా ప్రారంభించి, ఆమె పరువుతీసే ప్రయత్నం చేసిన ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు.

రాచకొండ పోలీసుల కథనం ప్రకారం మోసగాడి వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన నారయణదాసు మణిప్రకాశ్ షార్ట్ ఫిల్మ్స్ కు అసిస్టెంట్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్ తీసే క్రమంలో ఒక యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఆ సమయంలో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసుకుని భద్రపర్చుకున్ను. కొన్ని నెలల పాటు చెట్టాపట్టాలు వేసుకుని షికార్లు చేశారు. కలిసి జీవించారు. కొంతకాలానికి మనస్పర్థలు రావడంతో ఆ యువతి అతన్ని దూరంగా పెట్టింది. తనతో తిరిగి, పట్టించుకోకపోవడంతో కక్ష పెట్టుకున్న యువకుడు ఆమె పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు.

తప్పుడు పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా ప్రారంభించి ప్రొఫెల్ ఫొటో ఆమెది పెట్టాడు. దీనికి పలువురు నెటిజన్లు ఫ్రెండ్ రెక్వెస్టులు పెట్టగా అంగీకరించాడు. తనతో సన్నిహితంగా తిరిగిన ఫొటోలను షేర్ చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు మణిప్రకాశ్ ను అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.