FbTelugu

మహేష్ బాబుకి విలన్ గా చియాన్ విక్రమ్

మహేష్ బాబుకి విలన్ గా చియాన్ విక్రమ్

మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమా లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఏప్రిల్ 1వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి మహేశ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఆ తరువాత సినిమాను ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి. ఈ సినిమాలో విలన్ పాత్రకిగాను సీనియర్ స్టార్ హీరో విక్రమ్ ను ఎంపిక చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దక్షిణాఫ్రికా నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కి తాను పెద్ద అభిమానినని చెప్పాడు. ఆయన రాసిన ఒక పుస్తకం ఆధారంగా తాను ఒక కథ సిద్ధం చేయాలనుకుంటున్నట్టుగా చెప్పారు. బహుశా ఈ కథ అలా అక్కడి నుంచి వచ్చినదే అయ్యుంటుందని చెప్పుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.