FbTelugu

రైతుతో మొక్కించుకున్న వైద్యాధికారిణి

చిత్తూరు: రైతులకు మేలు చేయాల్సింది పోయి వారితోనే కాళ్లు మొక్కించుకుని, క్షమాపణ చెప్పించుకున్న వైద్యాధికారిణి సుజిత పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

యాదమరి మండలం మాదిరెడ్డి పల్లె పశు వైద్యాధికారిణి సుజిత వద్దకు ఒక రైతు వచ్చాడు. ఒక విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆగ్రహించిన ఆమె పాడిరైతుతో కాళ్లు మొక్కించుకుని, క్షమాపణ చెప్పించుకుని, మానవత్వం మంటగలిసేలా వ్యవహరించడం పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ శ్రీనివాసరావు జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ వెంకట్రావుతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

You might also like