FbTelugu

శాలువాలు, బోకేలు అసలే వద్దు: జిల్లా కలెక్టర్

చిత్తూరు: నా వద్దకు పనిమీద వచ్చేవారు శాలువాలు, బొకేలు, స్వీట్ డబ్బాలు, ఖరీదైన బహుమతులు తీసుకుని రావద్దని చిత్తూరు జిల్లా కలెక్టర్ మురుగన్ హరినారాయణన్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని తెలియచేస్తూ తన ఛాంబర్ బయట నోటీసు బోర్డు పెట్టించారు కూడా. హంగులు, ఆర్బాటాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం హర్షిస్తోంది. అదే విధంగా తన ఛాంబర్ లో జరిగే సమావేశాలకు టీ, స్నాక్స్ బిల్లులు కూడా పెట్టవద్దని పేషీ సిబ్బందిని ఆదేశించారు. ఆ బిల్లులకు అయ్యే మొత్తాన్ని కూడా తానే చెల్లిస్తానని స్పష్టం చేశారు. సమావేశాల్లో సందర్భాల్లో మినహా మిగతా సమయంలో దరఖాస్తుదారులు, ప్రజలు నేరుగా తన ఛాంబర్ లోకి పంపించాలని పేషీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా నేరుగా తన వద్దకే రావాలని, మధ్యవర్తులు అవసరం లేదని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.