FbTelugu

బిగ్ బాస్ ఆర్టిస్టు ఆత్మహత్యాయత్నం

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి, బిగ్​బాస్ షో ఆర్టిస్టు కొట్టూరు చైత్ర ఆత్మహత్యాయత్నం చేశారు. కోలార్​లోని తన ఇంట్లో ఫినాయిల్ తాగడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చైత్ర ఇటీవలే(మార్చి 28న) మాండ్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నాగార్జున అనే వ్యాపారవేత్తను బైత రాయనపుర గణపతి  ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. అప్పుడే వీరి వివాహ బంధంలో వివాదాలు తలెత్తాయని చర్చనడుస్తోంది. కోలార్ పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి నచ్చచెప్పి కాపురానికి పంపించారు. ఆమెను వివాహం చేసుకోవటం నాగార్జునకు ఇష్టం లేదని.. చైత్ర బలవంతం చేసిందని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. పెళ్లి చేసుకోనట్లయితే కేసు పెడతానని బెదిరించిందంటున్నారు. పెళ్లైన తరువాత నాగార్జున, ఆయన భార్య చైత్రను ఇంట్లోకి రానివ్వకపోవడం కూడా జరిగింది. బిగ్ బాస్ కన్నడ సీజన్-7లో పాల్గొన్న చైత్ర కొట్టూరు.. సుజీదార అనే సినిమాలో సహాయక పాత్రలో నటించి ప్రేక్షక ఆదరణ పొందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.