FbTelugu

చిరు 160 వ‌ర‌కూ రెడీ అయ్యారా!

చిరంజీవి.. టాలీవుడ్ పెద్ద‌న్న‌. కేవ‌లం మాట‌లు మాత్ర‌మే కాదు. ఆచ‌ర‌ణ‌లోనూ అది రుజువు చేస్తున్నారు. ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్‌తో అల్లాడుతుంది. తెలుగు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి.

సినిమాను న‌మ్ముకున్న వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున ప‌డేంత ప‌రిస్థితి. ఇటువంటి విప‌త్క‌ర స‌మ‌యంలో మెగాస్టార్ క‌రోనా క్రైసిస్ ఛారిటీ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. తానే ముందుండి విరాళాలు సేక‌రించారు. లాక్‌డౌన్ ముగిసేంత వ‌ర‌కూ సినీ కార్మికుల‌కు అవ‌స‌ర‌మైన ఆహార అవ‌స‌రాల‌ను స‌మ‌కూర్చారు. నేడో..రేపో పంపిణీకు సిద్ధ‌మవుతున్నారు.

చిరంజీవి బ్ల‌డ్‌బ్యాంక్‌లో తానే స్వ‌యంగా ర‌క్త‌దానం చేసి మ‌రింత స్పూర్తిని నింపారు. మ‌రోవైపు వ‌రుస సినిమాల‌కు.. అంటే. దాదాపు 160వ సినిమా వ‌ర‌కూ క‌థ‌లు వింటూ ద‌ర్శ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూనే ఉన్నారు. ఖైదీనెంబ‌రు 150 తో బ్లాక్‌బ్ల‌స్ట‌ర్‌కొట్టిన మెగాస్టార్ 151 సైరాతో త‌న‌న డ్రీమ్‌ప్రాజెక్ట్ పూర్తిచేసి అభిమానుల మ‌న్న‌న‌లు అందుకున్నారు. ఇప్పుడు అదే స్పీడుతో ఆచార్య‌గా కొర‌టాల శివ‌తో 152వ సినిమా తీస్తున్నారు. 153వ సినిమాగా.. లూసిఫ‌ర్ రీమేక్‌కు దాదాపు రంగం సిద్ధ‌మైంది. రామ్‌చ‌ర‌ణ్ దీనికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాఉ.

ఇలా.. యువ ద‌ర్శ‌కులు సుజీత్‌, బాబి, మెహ‌ర్‌ర‌మేష్‌, సుకుమార్‌, హ‌రీష్‌శంక‌ర్‌, ప‌ర‌శురాం త‌దిత‌రుతో క‌థాచ‌ర్చ‌లు కూడా జరుపుతున్నార‌ట‌. ఎంతైనా మెగాస్టార్‌.. త‌రం మారినా.. త‌న‌లో 1980లో వేగం.. స‌త్తా ఉంద‌ని మ‌రోసారి నిరూపిస్తున్నారు. ఇప్ప‌టి కుర్ర‌హీరోల‌కూ స్పూర్తిని పంచుతున్నారు.

You might also like