జబర్దస్త్ న్యాయ నిర్ణేత కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగే వివాహం కోసం చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు నాగబాబు కుటుంబం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు తరలి వెళ్లింది.
ఈ నేపథ్యంలో హీరో చిరంజీవి తన ట్విటర్ ఖాతాలో చిన్నప్పుడు బొద్దుగా ఉన్న నిహారిక ఫొటో ను షేర్ చేశారు. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న శుభ తరుణంలో… ముందస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. నా ఆశీస్సులు, గాడ్ బ్లెస్ యు అంటూ వారిని చిరంజీవి ఆశీర్వదించారు. బుధవారం రాత్రి ఉదయ్ పూర్ ప్యాలెస్ లో గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర రావు కుమారుడు వెంకట చైతన్యతో నిహారిక వివాహం జరనున్నది.
మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you! #NisChayWedding @IamNiharikaK pic.twitter.com/eLLPcZcYZV
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2020