FbTelugu

కుమార్తెతో జుత్తు కత్తిరించుకున్న చిరు

హైదరాబాద్: కరోనా సమయంలో సెలూన్ కు వెళ్లి జుత్తు కత్తిరించుకోలేని పరిస్థితి ఉంది. అదే విధంగా ఇంటికి పిలిపించుకోలేని సమస్య కూడా ఉంది.

ఈ నేపథ్యంలో హీరో చిరంజీవి జుత్తు బాగా పెరిగిపోవడంతో ఇంట్లోనే కత్తిరించుకోవాలని నిర్ణయించారు. తన పెద్ద కుమార్తె సుస్మిత తో కటింగ్ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ను సుస్మిత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలెబ్రిటీలు ఇళ్లలోనే కటింగ్ చేయించుకుంటున్నారు. కుటుంబ సభ్యులే క్షురకులుగా అవతారమెత్తుతున్నారు.

 

You might also like