FbTelugu

చిరంజీవి గుండు రహస్యం వీడింది

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గుండు రహస్యం ఎట్టకేలకు వీడింది. గత కొన్ని రోజుల క్రితం చిరంజీవి గుండుబాస్ గా కనిపించడం, అలాగే తన ట్విట్టర్ ఖాతాలోనూ డీపీగా గుండుతో ఉన్న ఓ కార్టూన్‌ను పెట్టుకోవడంతో సోషల్ మీడియాలో వీక్షకులకు పెద్ద షాకే ఇచ్చారు. అయితే చిరంజీవి గుండుపై అభిమానుల్లో అనేక సందేహాలు రేపింది. అసలు చిరంజీవి గుండు ఎందుకు చేయించుకున్నారు.

తన నెక్స్ట్ మూవీ కోసం ఫొటోషూట్ లో అలా కనిపించారా..? లేక పోతే మామూలుగానే చేయించుకున్నారా అని ప్రశ్నలు రేకెత్తించాయి. దీనిపై తాజాగా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ‘మేకింగ్‌ ఆఫ్ అర్బన్‌ మాంక్‌’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ద్వారా తాను గుండు చేయించుకోలేదని.. ఫొటోషూట్ లో భాగంగానే మేకప్ మాయతో గుండు గెటప్‌ వేయించుకున్నట్టుగా స్పష్టతనిచ్చారు.

You might also like