FbTelugu

ఉయ్యాల నరసింహారెడ్డి పేరుపై చిరంజీవి హర్షం

హైదరాబాద్‌: కర్నూలు విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు, రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్య సమరయోధుడికి సముచిత గౌరవం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగించిందని చిరంజీవి అన్నారు. ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మించిన ఓర్వకల్లు విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్‌ ప్రకటించారు.

ఈ విషయంపై చిరంజీవి ట్విట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటనతో ఆనందంలో మునిగితేలుతున్నానన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. గొప్ప దేశభక్తుడు, నిజమైన యోధుడు.. ఆయన ఈ గుర్తింపునకు పూర్తి అర్హుడు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్ర పోషించే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం అని సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రేనాటి వీరుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ సినిమాలో మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.