FbTelugu

మొక్కలు నాటిన చిరంజీవి కుమార్తె సుస్మిత

హైదరాబాద్: హీరో చిరంజీవి గారి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల తన భర్త విష్ణుప్రసాద్ తో కలిసి ఈరోజు జూబ్లీహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణంలో మూడు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ ఈరోజు మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్ డౌన్ సమయంలో ఏదైనా మంచి పని చేశాము అంటే ఈరోజు ఈ మొక్కలు నాటడమేనన్నారు. నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటిని రక్షిస్తే మనకు ఆక్సిజన్, నీడను ఇస్తాయి అని తెలిపారు.

 

You might also like