వాషింగ్టన్: కరోనా వైరస్ చైనా సృష్టే అంటూ.. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనాకు చెందిన 33 కంపెనీలు గూఢచర్యానికి
పాల్పడుతున్నాయంటూ.. వాటిని అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈ కంపెనీలు మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని, అదేవిధంగా వీటికి చైనా మిలటరీతో ఈ సంస్థలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.