వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా చైనాకు మరోషాక్ ఇచ్చింది. చైనాకు చెందిన పలు విమానయాన సర్వీసులను నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే..
అయితే ఈ కరోనా వైరస్ చైనా సృష్టే అంటూ… మొదటి నుంచి అమెరికా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాను ప్రపంచ దేశాల నడుమ ఒంటరిని చేయాలని అమెరికా భావిస్తోంది. ఇలాంటి తరుణంలో తాజా ట్రంప్ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నిర్ణయం జూన్ 16 నుంచి అమలులోకి రానున్నట్టు తెలిపారు.