బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా జోసెఫ్ ఆర్.బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైనా దేశం కీలక నిర్ణయం తీసుకున్నది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్ పాంపియో తో పాటు 27 మంది నేతలు దేశంలో అడుగుపెట్టకుండా నిషేధం విధించింది.
వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా దేశంలో అడుగుపెట్టవద్దని చైనా స్పష్టం చేసింది. చైనాతో పాటు హాంకాంగ్, మకావులో కూడా రావద్దని ఆదేశించింది. వ్యక్తిగత పనులు అయినా, వాణిజ్య సంబంధాలు అయినా కూడా అనుమతించబోమని చైనా దేశం ఆదేశాల్లో పేర్కొంది.