FbTelugu

భారత్ పై చైనా అక్కసు

మా యాప్ లను ఎలా నిషేధిస్తారు?
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం పై చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లను నిషేధించడంతో ఏం చేయాలో పాలుపోక లేఖ ద్వారా ఆక్రోశం వ్యక్తం చేసింది.
ఇలా నిషేధించడం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొంది. గతేడాది ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, చైనా దురాక్రమణకు ప్రయత్నించడంతో భారత ప్రభుత్వం కూడా అంతేరీతిలో సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.

చైనా ను పూర్తిగా కట్టడి చేసేందుకు టిక్ టాక్ సహా అనేక యాప్ లను నిషేధించింది. నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తాజాగా శాశ్వతంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది.
ఈ నిర్ణయం చైనా ప్రభుత్వానికి ఏమాత్రం రుచించలేదు. ఈ నిర్ణయంపై ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి జీరోంగ్ స్పందించారు. జాతీయ భద్రతను సాకుగా చూపి చైనాకు చెందిన వందల యాప్ లను నిషేధించారన్నారు. ఇప్పటికైనా వివక్షతతో కూడిన ఇలాంటి చర్యలను భారత్ సరిచేసుకోవాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.