FbTelugu

చైనా వీసాలు ఇక కఠినతరం

ఢిల్లీ: వ్యాపార, వాణిజ్య సంబంధాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న భారత ప్రభుత్వం మరో అడుగు వేసింది. పాకిస్థాన్ దేశం విషయంలో అనుసరిస్తున్న వీసా విధానాన్నే చైనా దేశం పట్ల అనుసరించాలని నిర్ణయం తీసుకున్నది.

ఇకనుంచి చైనా దేశం నుంచి భారతదేశం రావాలని అనుకుంటే విదేశీ వ్యవహారాల శాఖ సెక్యురిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాల శాఖ అనుమతిస్తే భారత్ లో అడుగుపెట్టడానికి వీలుంటుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని పాకిస్థాన్ దేశం విషయంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్నది. తాజా నిర్ణయం ప్రకారం చైనా దేశం నుంచి వచ్చే వ్యాపార, వాణిజ్య, విద్యా, పారిశ్రామికవేత్తలకు గడ్డు పరిస్థితే ఉంటుంది.

ఇప్పటికే ఎన్నో ఆంక్షలు అమలు చేస్తున్న భారత ప్రభుత్వం, చైనా దేశంతో అనుబంధం ఉన్న యూనివర్సిటీలపై సమీక్షిస్తున్నది. ఏ యూనివర్సిటీతో చైనా దేశానికి సంబంధాలు ఉన్నాయి, ఏ రకమైన ఒప్పందాలు ఉన్నాయనే దానిపై కేంద్ర విద్యాశాఖ పరిశీలిస్తోంది.

You might also like