FbTelugu

చైనా వ్యాక్సిన్… పెరుగుతున్న కేసులు!

బీజింగ్: చైనా దేశం తయారు చేసిన సైనో వ్యాక్, సైనో ఫార్మ్ వ్యాక్సిన్లను తీసుకుంటున్న దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. వైరస్ కేసులను నిలువరించడంలో విఫలమయ్యాయమని ఆ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి.
పాకిస్థాన్ తో పాటు సేచెలిస్, చీలి, బహ్రేయిన్, మంగోళియా వంటి దేశాలు చైనా వ్యాక్సిన్లను వాడుతున్నాయి.

తక్కువ ధరకు లభ్యం కావడంతో వాటిని కొనుగోలు చేసి ప్రజలకు ఇస్తున్నాయి. ఈ దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం 50 నుంచి 68 శాతం వరకు పూర్తయింది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలనే దానిపై ఆ దేశాల అధినేతలు పునరాలోచనలో పడ్డారు. కేసులు నమోదు అవుతున్న టాప్ టెన్ దేశాల్లో ఈ దేశాలు ఉండడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.