FbTelugu

చైనా దురాగతాలపై ప్రతీకారం తీర్చుకోవాలి: ఓవైసీ

హైదరాబాద్: చైనా సరిహద్దులో ఏం జరుగుతుందో కేంద్రం స్పష్టతనివ్వాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన పలు వ్యా్ఖ్యలు చేశారు.

చైనా దురాగతాలు నిజమైతే.. కచ్చితంగా భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని అన్నారు. దీనిపై ప్రధాని కార్యాలయం, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ ఇవ్వాలన్నారు. దేశంలో ఇంత జరుగుతున్నా.. మోదీ అనుచరులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

You might also like