FbTelugu

దెబ్బకు దెబ్బకొట్టిన చైనా

ఢీల్లి: ఇండియా నుంచి వెలువడే న్యూస్ వెబ్ సైట్స్, పత్రికలను చైనా ప్రభుత్వం కన్పించకుండా చేసింది. అత్యంత శక్తివంతమైన ఫైర్ వాల్ ను రక్షణగా నిలిపి, న్యూస్ సెన్సార్ అమలుచేస్తోంది.
ఇండియా గవర్నమెంట్ సోమవారం రాత్రి 59 చైనా యాప్స్ నిషేధించిన విషయం తెలిసిందే. ఈ యాప్స్ నిషేధంతో చైనా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. సంబంధిత కంపెనీలో వందలాది కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడబోతున్నాయి. దీంతో చైనా కూడా ఇండియా కు సంబంధించిన అంశాలపై దృష్టి సారించింది. వెబ్ సైట్స్ తో పాటు టీవీ ఛానళ్లు రాకుండా నిషేధం విధించింది.

హాంకాంగ్ ఉద్రిక్తత పెరగడంతో హాంకాంగ్ ప్రొటెస్టు అనే పదాన్ని సెన్సార్ చేసింది. ఆ పదంతో రాసిన వార్తలు చైనాలో కన్పించడం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.