FbTelugu

నేపాల్ పై పడిన డ్రాగన్ కన్ను

చైనా గత కొన్ని రోజులుగా తన దుందుడుకు చర్యలను తీవ్రతరం చేసింది. తాజాగా భారత సరిహద్దులోకి చొచ్చుకొచ్చిన చైనా సైనికులు భారత సైనికులతో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. కాగా తాజాగా చైనా కన్ను నేపాల్ పై పడినట్టుగా తెలుస్తోంది.

నేపాల్ సరిహద్దులోని స్థంభాలను తొలగించి కొంత భూమిని ఆక్రమించినట్టు సమాచారం. నేపాల్ లోని రుయి అనే గ్రామాన్ని ఆక్రమించినట్టుగా తెలుస్తోంది. నేపాల్ సరిహద్దులోని సుమారు 11 ప్రాంతాలను ఆక్రమించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.

You might also like