FbTelugu

డబ్ల్యూహెచ్ఓ పర్యటనకు చైనా ఓకే

బీజింగ్: ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్ లో పుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మూలాలను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధులు చైనాలోని వుహాన్ లో పర్యటించేందుకు సిద్ధమైనారు. ఇందుకు చైనా కూడా అంగీకరించింది.

వారి పర్యటనకు కావాల్సిన సదుపాయాలను కల్పించనున్నట్టు తాజాగా స్పష్టం పేర్కొంది. అయితే గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ దేశంలో పర్యటించడానికి చైనా అంగీకరించలేదు. తాజాగా కరోనా వైరస్ నుంచి స్ట్రెయిన్ వైరస్ బ్రిటన్ లో ఉద్బవించి వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోనూ మరో కొత్త వైరస్ ను కనుగొన్నట్టు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.