FbTelugu

అమెరికా జెండా దించేసిన చైనా

బీజింగ్: అమెరికా, చైనా దేశాల మధ్య నిన్నటి వరకు మాటల యుద్దం జరగ్గా ఇప్పుడు చర్యలకు దిగుతున్నాయి.
హోస్టన్ లో చైనా రాయబార కార్యాలయాన్ని 72 గంటల్లో మూసివేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గతవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా చైనా తమ దేశంలోని చెంగ్డూ ప్రావీన్స్ లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం లైసెన్స్ ను రద్దు చేసింది.

మరో అడుగు ముందుకు వేస అమెరికా కాన్సూలెట్ పై ఉన్న ఆ దేశ జాతీయ జెండాను దించేసింది. రాయబార కార్యాలయం అని సూచించే బోర్డును ఒక వ్యక్తి తొలగిస్తున్న ఫొటోలను మీడియాకు విడుదల చేసింది. కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయించే చర్యలను చైనా దేశం చేపట్టింది.

You might also like