FbTelugu

జపాన్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా

ఓ పక్క భారత్ తో సరిహద్దు విషయంలో తీవ్రంగా విషం చిమ్ముతున్న చైనా.. మరో పక్క జపాన్ తోనూ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ ద్వీపం విషయంలో జపాన్ కు చైనాకు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది.

కాగా.. తాజాగా జపాన్ ఆ ద్వీపం పేరును మార్చేందుకు బిల్లు పాస్ చేసింది. ఈ నిర్ణయంతో ఆగ్రహానికి గురైన చైనా జపాన్ తో గొడవకు దిగింది. ఈ నిర్ణయంపై హెచ్చరికలు కూడా జారీ చేసింది. చైనా ఒక్క భారత్ తోనే కాకుండా.. ఆ దేశం పక్కనున్న సుమారు 10 దేశాలతో ఇలాంటి గొడవలనే పెట్టుకుంటోంది.

You might also like