FbTelugu

సరిహద్దులో మళ్లీ విషం కక్కుతున్న చైనా

భారత్-చైనా సరిహద్దులో చైనా మళ్లీ విషం కక్కుతోంది. తన సైన్యాన్ని వెనక్కి తీసుకెళుతున్నామని చెబుతూనే మరో పక్క ఉత్తరాఖండ్‌లోని లిపులేక్ పాస్ వద్ద పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) ని భారీగా మోహరిస్తోంది. తాజా చైనా దుందుడుకు చర్యలతో మరోమారు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చైనాకు దగ్గరైన నేపాల్ ఇటీవలే లిపులేక్ పాస్ తమదేనంటూ వాదించింది. ఇదే ఆసరాగా తీసుకొని చైనా లిపులేక్ పాస్ లో భారీగా సైన్యాన్ని మొహరించింది. దీంతో అప్రమత్తమైన భారత్ కూడా బలగాలను మొహరించింది.

You might also like