FbTelugu

యుద్దం వస్తే అమెరికా తుక్కు తుక్కు…

బీజింగ్: అమెరికా లో అధ్యక్షుడు మారినా చైనా వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. అదను దొరికినప్పుడల్లా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తునే ఉన్నది. ఒక వేళ యుద్దం కనుక వస్తే అమెరికా ఓటమి తప్పదని ఛైనా స్పష్టం చేసింది.

చైనా అధికారిక పత్రిక గ్లోబల టైమ్స్ సంపాదకీయంలో ఈ విషయాలను రాసుకొచ్చింది. ఇందులో ప్రచురించిన ప్రతి అక్షరాన్ని ప్రభుత్వ ప్రకటనగానే ప్రజలు భావిస్తారు. తమ దేశాన్ని సూపర్ గా అభివర్ణించుకున్నది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్ సైనిక విన్యాసాలలో అమెరికా ప్రమేయంపై గ్లోబల్ టైమ్స్ ఈ సంపాదకీయంలో పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్రం మొత్తానికి చైనా తన సంపదకు కారణమని పేర్కొన్నది. దీనిపై మలేషియా, ఫిలిప్పీన్స్ బ్రూనై, వియత్నాం, తైవాన్ దేశాల వాదనను చైనా కొట్టి పారేసింది. ఒకవేళ దక్షిణ చైనా సముద్రంపై ఇరుదేశాల యుద్దం జరిగే అమెరికా ఓడిపోవడం ఖాయమని చైనా స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.