FbTelugu

అలీబాబా కంపెనీకి చైనా బ్రేకులు

బీజింగ్: ఆన్ లైన్ సంస్థ అలీబాబా, యాంట్ గ్రూపు వ్యవస్థాపకుడు జాక్ మా కు చైనా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన షాక్ తో జాక్ మా దిమ్మ తిరిగింది.
చైనా దేశంలో ఇంటర్నెట్ వ్యాపారంలో గుత్తాధిపత్య వ్యతిరేక పద్దతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. యురోపియన్ దేశాల్లో ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల గుత్తాధిపత్యంపై ప్రభుత్వాలు కఠిన చర్యలకు దిగడంతో చైనా కూడా అదే దారిలో పయనిస్తున్నది. తన వ్యాపారాలను సరిదిద్దుకోవాలని, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని నియంత్రణా సంస్థ జాక్ మా కు స్పష్టం చేశాయి.

యాంట్ గ్రూపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో చైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో కంపెనీ షఏరు విలువ ఒక్కసారిగా 6 శాతం పడిపోయింది. మార్కెట్ లో పోటీతత్వం లేకుండా, కస్టమర్లకు ప్రత్యామ్నాయం లేకుండా చేస్తుందని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. అలీబాబా మాతృసంస్థ భారత దేశంలో స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.