FbTelugu

సైనిక, ఆర్థిక ముప్పుగా చైనా దేశం: అమెరికా

వాషింగ్టన్: అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను చైనా బేఖాతర్ చేస్తున్నదని, ఆసియా ప్రాంతంలో అతి పెద్ద మార్కెట్ గా అవతరించి సైనిక, ఆర్థిక ముప్పుగా మారిందని అమెరికా సెక్రెటరీ ఆఫ్ కామర్స్ విల్ బర్ రాస్ మండిపడ్డారు.
మిల్కెన్ ఇనిస్టిట్యూట్ ఆసియా సమ్మిట్ లో రాస్ ప్రసంగించారు. అమెరికాకు సరఫరా చేసే కంపెనీల ప్రవేశాన్ని దేశ భద్రత కారణాలపై కట్టడి చేసే అమెరికా ఎంటిటీ లిస్టులో చైనా కంపెనీలే ఉన్నాయన్నారు.

అమెరికా మొత్తం 539 యాంటి డంపింగ్, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఆర్డర్స్ విధించిందని, వీటిలో చైనా కంపెనీలు 210 ఉన్నాయన్నారు. అమెరికా వాస్తవంగా అతి తక్కువ రక్షణ వాదంతో నడిచే ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని రాస్ వెల్లడించారు.
కారణం లేకుండా, ఇష్టానుసారంగా తక్కువ ధరలకు ఉత్పత్తులు విక్రయించినప్పుడు యాంటీ డంపింగ్, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీలు విధిస్తారన్నారు. ఎంటిటీ లిస్టులో చైనా టెలికాం దిగ్గజం హువావే కూడా ఉందని రాస్ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.