FbTelugu

సరిహద్దుల్లో చైనా దూకుడు

న్యూఢిల్లీ: గతేడాది గల్వాన్ లోయలో మొదలైన చైనా-భారత్ గొడవలు ఇంకా సమసిపోవడం లేదు. రెండు దేశాల మధ్య చర్చల ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. కాని చైనా దేశం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది.

తూర్పు లద్దాఖ్ కు ఎదురుగా ఉన్న తన వైమానిక స్థావరాల వద్ద ఆధునాతన యుద్ధ విమానాలతో విన్యాసాలు చేపట్టగా, 22 యుద్ధ విమానాలు పాల్గొనడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న హోటన్, గార్ గున్సా, ఖాష్గర్ వైమానిక స్థావరాల నుంచి చైనా దేశం విన్యాసాలు నిర్వహించింది. గతేడాది గల్వాన్ లోయలో ఉద్రిక్తత మొదలు కాగా భారత వాయుసేన తన గస్తీ పెంచింది. మిగ్ సహా ఫైటర్ జెట్లు నిత్యం పహారా కాస్తున్నాయి. అధునాత రాఫేల్ యుద్ధ విమానాలను కూడా మొహరించారు. పలు దఫాలు చర్చలు జరిగిన తరువాత ఇటీవల రెండు దేశాలు సరిహద్దుల నుంచి క్రమంగా బలగాలను వెనక్కి తీసుకున్నాయి. పాంగాంగ్ సరస్సు నుంచి బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ ఇంకా వైమానిక దళాలు అక్కడే కొనసాగుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.