FbTelugu

చైల్డ్ ట్రాఫికింగ్… మరో ఇద్దరు పోలీసు కస్టడీకి

విశాఖపట్నం: సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను కోర్టు కస్టడీకి అనుమతించింది.
కేసులో ఉన్న ఎ5 డాక్టర్ తిరుమల, ఎ4 రామకృష్ణనూ కస్టడీకి తీసుకోనున్నారు. ఎ1 గా ఉన్న డాక్టర్ నమ్రత కస్టడీ పొడిగించాలంటూ పిటిషన్ వేయగా మరో మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. నమ్రతతో పాటు ఎ5 డాక్టర్ తిరుమలను మహారాణిపేట పీఎస్‌లో విచారణ చేయనున్నారు.

పోలీసులు ఇప్పటికే నమ్రతను రెండు రోజులు విచారించారు. ఎ1 ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఈ కేసులో మరో ఇద్దరిని కస్టడీకి కోరారు. హాస్పిటల్ లో జరిగిన 63 ప్రసవాల అసలు తల్లిదండ్రులు, చిన్నారులెక్కడున్నారు..?. వేరొకరి చేతుల్లోకి వెళ్లాయా అన్న దానిపై కూపీ లాగుతున్నారు. ఈ విషయంలో ఎ4 ఏజెంట్ రామకృష్ణను పోలీసులు విచారించనున్నారు.

You might also like