FbTelugu

వారం రోజుల చిన్నారి విక్రయం

గుంటూరు: వారం రోజుల చిన్నారిని ఓ తల్లి విక్రయించిన దారుణ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని జీజీహెచ్ ఆస్పత్రిలో లక్ష్మీగాయత్రి అనే మహిళ వారం రోజుల క్రితం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఆ చిన్నారిని సత్యవతి అనే మధ్యవర్తి సాయంతో రూ.75 వేలకు విక్రయించింది.

వాలంటీర్లు ఇచ్చిన సమాచారంతో ఈ విషయం బయటపడింది. శ్రీలక్ష్మి తన భర్త నుంచి విడాకులు తీసుకొని వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టుగా గుర్తించారు. పక్కా సమాచారంతో చిన్నారిని గుర్తించిన పోలీసులు ఆ చిన్నారిని చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించారు. ప్రస్తుతం తల్లి లక్ష్మీ గాయత్రి, మధ్యవర్తి సత్యవతి పరారీలో ఉన్నట్టుగా గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.