FbTelugu

బాల్యంలో రేప్… 27ఏళ్ల తరువాత కేసు!

లక్నో: బాల్యంలో ఉన్నప్పుడు, 27ఏళ్ల క్రితం ఒక బాలిక అత్యాచారానికి గురైంది. ఇద్దరు వ్యక్తులు పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఆ తరువాత మగ పిల్లాడిని కని, ఒకరికి దత్తత ఇచ్చింది. ఇప్పుడా ఆ అబ్బాయి తండ్రి కోసం పోలీసులు కేసు నమోదు చేశారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉధమ్ పూర్ గ్రామంలో 12 సంవత్సరాల బాలిక అక్కా బావలతో కలిసి ఉంటున్నది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొరుగింట్లో ఉండే నక్కి హసన్ ఆమెపై కన్నేశాడు. కల్లబొల్లి మాటలు చెప్పి బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇది చూసిన హసన్ సోదరుడు గుడ్డు కూడా ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఇద్దరి కారణంగా ఆమె గర్భవతి అయిత 1994 లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. బావ కు ఉద్యోగ బదిలీ కావడంతో బాబును అదే గ్రామంలో దత్తత ఇచ్చి వెళ్లిపోయింది. వేరే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేయగా, 12 ఏల్ల వయస్సులోనే అత్యాచారానికి గురైందని తెలుసుకుని విడాకులిచ్చాడు. దీంతో ఆమె తిరిగి ఉధమ్ పూర్ కు చేరుకున్నది. ఈ లోపు తన తండ్రి ఎవరనేదానిపై యువకుడు తెలుసుకునే ప్రయత్నంలో పడ్డాడు. తల్లి కూడా రావడంతో దత్తత తీసుకున్న వ్యక్తి కలిసి వివరించాడు.
తనను ఇద్దరు వ్యక్తులు అనుభవించడంతో గర్భవతిని అయ్యానని, వారి పేర్లను వారిద్దరికి వివరించింది. అందరూ కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా తిరస్కరించారు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశం మేరకు షహబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 1994 లో అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై డీఎన్ఏ పరీక్షలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. తన తల్లి తిరిగి గ్రామానికి రావడంతో వారిద్దరికి శిక్షపడేలా చేస్తానని ఆ యువకుడు శపథం చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.