FbTelugu

ఐదు కుక్కలు దాడి.. చిన్నారి మృతి

హైదరాబాద్: ఐదు వీధి కుక్కలు దాడి చేసిన చిన్నారి ఇవాళ ఆస్పత్రిలో పరిస్థితి విషమించి మృతి చెందింది. వివరాల్లోకెళితే.. నిన్న నగరంలోని చెంగిచెర్లలో ఓ చిన్నారిపై ఒక్కసారిగా ఐదు వీధికుక్కలు దాడి చేశాయి.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఐదు ఆస్పత్రులు తిప్పారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించారు అక్కడ కూడా మెరుగైన వైద్యం అందడం లేదని పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. నీలోఫర్ ఆస్పత్రిలో ఆ చిన్నారి చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.

You might also like