FbTelugu

పేట డ్యాన్సర్లం… ఉపాధి కల్పించండి!

తహశీల్దార్ ను కోరిన చిలకలూరి పేట డ్యాన్సర్లు
గుంటూరు: కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఐదు నెలలుగా ఉపాధి లేకుండా ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్నామని, ఆదుకోవాలని చిలకలూరి పేట రికార్డు డ్యాన్సర్లు వేడుకుంటున్నారు.
ఈ మేరకు వారు ర్యాలీగా వెళ్లి చిలకలూరిపేట తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఏ సాయం అందక నానా ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. సాధారణ రోజుల్లో ప్రభుత్వం నుంచి ఏనాడు పైసా ఆశించలేదని, ఉపాధి లేకే సాయం కోరుతున్నామని మహిళలు తహశీల్దార్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కార్యక్రమంలో రికార్డు డ్యాన్సర్ల సంఘం నాయకురాలు హసీనా, లక్ష్మీ పాల్గొన్నారు.

You might also like