FbTelugu

మేం గెలిస్తే ‘‘జీడీపీ’’ తగ్గిస్తాం: స్టాలిన్

చెన్నై: తాము అధికారం లోకి వస్తే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని ద్రావిడ మున్నెట్ర కజగం (డీఎంకె) అధినేత ఎంకె.స్టాలిన్ ప్రకటించారు. ఇవాళ ఆయన తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

హిందూ దేవాలయాల పునరుద్దరణకు రూ.1 వేయి కోట్లు, మసీదులు, చర్చీల పునరుద్దరనఖు రూ.200 కోట్లు మంజూరు చేస్తారు. అన్నా డీఎంకె మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు, జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్, నీట్ పరీక్ష రద్దు, కోయంబత్తూరు సహా ఇతర ప్రధాన పట్టణాలలో మెట్రో రైలు ప్రాజెక్టులు, ప్రముఖ యాత్రా స్థలాలకు వెళ్లే లక్ష మందికి రూ.25వేల సాయం, ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 40 శాతం రిజర్వేషన్, కలైంగర్ క్యాంటిన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది పాటు మెటర్నిటీ సెలవులు మంజూరు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.