FbTelugu

లాక్ డౌన్ జిఒ… జోక్ చేయడానికే!

హైదరాబాద్: కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు లాక్ డౌన్ వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూసివేయాలంటూ ఈ నెల 1వ తేదీన జిఒ విడుదల అయ్యింది.

ఈ జిఒ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పందించక తప్పలేదు. ప్రజలు వదంతులు నమ్మవద్దని, రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈలోగా ఆ నకిలీ జిఒ జరగాల్సిన దుష్ప్రచారం జరిగిపోయింది. ఈ నకిలీ జిఒ తయారు చేసిన వ్యక్తిని విచారించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడంతో నగర పోలీసులు రంగంలోకి దిగారు.

తొలుత ఈ జిఒ ను ఎవరు తయారు చేసి షేర్ చేశారో తెలియచేయాల్సిందిగా పోలీసు శాఖ వాట్సప్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా కంపెనీలను కోరింది. వారిచ్చిన సమాచారంతో సంజయ్ కుమార్ సూత్రదారిగా తేలారు. నెల్లూరు జిల్లాలో ఛార్టెర్డు అక్కౌంటెంట్ గా పనిచేస్తున్న సంజయ్ నకిలీ లాక్ డౌన్ జిఒ తయారు చేసి వాట్సప్ లో షేర్ చేశారు. ఇవాళ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. ఎందుకు ఈ పని చేశావని ప్రశ్నించగా, జోక్ చేయడానికేనని, మరే ఉద్దేశం తనకు లేదని సంజయ్ చెప్పడం పోలీసులకు మరింత కోపం తెప్పించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.