FbTelugu

తమిళనాడు ఎంట్రీ అంత ఈజీ కాదు

చెన్నై: కరోనా పాజిటివ్ కేసులు తిరగబెడుతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. కర్ణాటక, పుదుచ్చేరి, ఏపీ రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు, విదేశాలను చి వచ్చేవారికి ఇక నుంచి ఈ పాస్ తప్పనిసరి చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. వ్యాపార పనుల నిమిత్తం వచ్చి, ఆ రోజే వెళ్లిపోయేవారికి క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

విదేశాల నుంచి తమిళనాడు వచ్చేవారు 72 గంటల ముందుగా కరోనా టెస్టులు చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్ వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది. అదే విధంగా 14 రోజుల ముందు ప్రయాణానికి సంబంధించిన వివరాలు న్యూఢిల్లీఎయిర్ పోర్టుడాట్.ఇన్ వెబ్ ఫోర్టల్ లో నమోదు చేయాలి. విమానాశ్రయంలో కరోనా టెస్టు నిర్వహిస్తారు. రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత పెంచారు. అనుమతి లేకుండా వచ్చేవారిని క్వారంటైన్ ను పంపించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్కలు ధరించకుండా బయట తిరిగే వారిపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.