FbTelugu

అప్పుడు తప్పులు… ఇప్పుడు చర్యలు!

అమరావతి: పీఎంఏవై లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడ్డారని 10 మంది మున్సిపల్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. 2015-2016లో రాజకీయ ఒత్తిడికి తలొగ్గి అక్రమాలకు పాల్పడ్డారని విచారణలో స్పష్టమైంది.
ఈ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టనున్నట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ ఎదుర్కొనున్న పది మంది అధికారులు పేర్లు ఇలా ఉన్నాయి.

సత్తెనపల్లి టౌన్‌ ప్లానింగ్ అధికారి కె.శ్రీనివాసరావు, విజయవాడ టౌన్‌ ప్లానింగ్ అధికారి మోహన్‌బాబు. గుంటూరు టౌన్ ప్లానింగ్ అధికారి మల్లికార్జున, మంగళగిరి మున్సిపల్ కమిషనర్ ఎం.వి. నాగేశ్వరరావు, ఉద్యోగి దుర్గారావు, మేనేజర్ విజయలక్ష్మి, క్లర్క్‌ శివనాగేశ్వరరావు, తాడేపల్లి మున్సిపాల్టీ ఆర్‌ఐ మధుకిరణ్‌, విశాఖ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, మంగళగిరి మాజీ మున్సిపల్ కమిషనర్ టి.వి. రంగారావు.

You might also like

Leave A Reply

Your email address will not be published.