FbTelugu

సిఎం జగన్ ఫొటో వైరల్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసతున్నారు. బ్రాడీపేటకు చెందిన ఇక్కుర్తి వెంకట్ రీడింగ్ రూమ్ నడుపుతున్నాడు.

ప్రముఖ జాతీయ నేతల ఫొటోల మధ్య జగన్ చిత్రాన్ని పెట్టారు. కొందరు వ్యక్తులు దీన్ని ఫొటో తీసి, అభ్యంతరకర పదాలు జోడించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. తన రీడింగ్ రూమ్ లో పెట్టిన ఫొటోలను ఎవరో ఫొటో తీసి, అసభ్య పదాలు పెట్టారంటూ వెంకట్ అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొలిటికల్ మోజి అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు సీఎం పట్ల అసభ్యకరంగా పోస్టు పెట్టింది. దీనిపై వైసిపి నాయకులు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.