FbTelugu

రేపు యాదాద్రికి సుప్రీం సిజె, గవర్నర్, సిఎం

హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్.వి.రమణ తో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ ఆదివారం యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సింది ఆలయ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అధికారులతో కలిసి యాదాద్రికి వెళ్లనున్నారు. జస్టిస్ రమణ కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు.

రమణ స్వస్థలం ఏపి లోని కృష్ణా జిల్లా అయినా ఆయన చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం నాడు రమణ దంపతులు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విషయం విదితమే. తిరుమల లో దర్శనం పూర్తయిన తరువాత అదేరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఏయిర్ పోర్టు నుంచి నేరుగా రాజ్ భవన్ చేరుకున్నారు. తిరిగి ఢిల్లీ వెళ్లే వరకు రాజ్ భవన్ లోనే బస చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.