FbTelugu

విచారం తెలిపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: సచివాలయంలో భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, రెండు మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల సీఎం కేసీఆర్ తన విచారాన్ని, బాధను వ్యక్తం చేశారు.

సచివాలయంలోనే ఇప్పుడున్న వాటికన్నా విశాలంగా, గొప్పగా కొత్తగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మించడం కోసం ప్రస్తుత భవనాల కూల్చివేత ప్రక్రియ జరుగుతున్నదన్నారు. దీనిలో భాగంగా ఎత్తయిన భవనాలను కూల్చివేసే సందర్భంలో కొన్ని శిథిలాలు, పెచ్చులు దేవాలయం, మసీదులపై పడ్డాయని సీఎం అన్నారు.

ఇది నాకు ఎంతో బాధ కలిగించిందని, చాలా విచారకరం అన్నారు. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నాను. ప్రభుత్వ ఉద్దేశ్యం ఇప్పుడున్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం. అంతే తప్ప మసీదులు, దేవాలయం చెడగొట్టడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదన్నారు. ఎన్ని కోట్లయినా సరే వెచ్చించి, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో వాటిని పునర్ నిర్మాణం చేస్తామన్నారు. నేనే స్వయంగా దేవాలయం, మసీదు నిర్వాహకులతో సమావేశమవుతాను అని కేసీఆర్ తెలిపారు. వారి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వం నిర్మాణాలను చేపడుతుందన్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.