FbTelugu

విశాఖ స్టీలుపై ఇంత రాజకీయమా?: సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చేసిన ప్రకటను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై నిర్మలా సీతారామన్ చెప్పినదానిలో కొత్త పాయింట్ ఏమీ లేదని ఆయన కొట్టిపారేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రా సెంటిమెంట్‍లో ఒక భాగమని, కేంద్రం తలచుకుంటే ప్లాంట్‍ను పునరుద్ధరించవచ్చన్నారు.  స్టీల్ ప్లాంట్‍తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారన్నారు. ఇప్పటికైనా జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ కేంద్రాన్ని ప్రశ్నించవచ్చుకదా? అని అన్నారు. కేంద్రం ప్రకటనపై ఎల్లో మీడీయా తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‍పై సీఎం జగన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‍ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారని, లాభాల్లోకి తీసుకురావటానికి సూచనలు చేశారని ఆయన వివరించారు. అఖిలపక్షం, కార్మిక సంఘాలతో కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా లేఖ రాశారు. కృష్ణపట్నంలో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని పోస్కోను కోరామని, పోస్కో ప్రతినిధులు కూడా కృష్ణపట్నం వచ్చి పరిశీలించారని ఆయన వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‍ను ఎలా కాపాడుకోవాలో సీఎం జగన్‍కు తెలుసని గాబరా వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.