FbTelugu

చైనాతో యథాతథ స్థితి కొనసాగిస్తారా?: చిదంబరం

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ చైనాతో యథాతథ స్థితి కొనసాగిస్తారా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఇప్పటికే సరిహద్దు విషయంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు పీఎల్‌ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) మరోసారి మొత్తం గాల్వన్ లోయకు తమ వాదనను నొక్కిచెప్పాయని, భారత దళాలు ఆ లోయను ఖాళీ చేయాలని డిమాండ్ చేశాయని అన్నారు.

ప్రధాని చెప్పిన దానికి విరుద్ధంగా 2020 ఏప్రిల్-జూన్లలో చైనా దళాలు యథాతథ స్థితిని మార్చాయని అన్నారు. ప్రస్తుతం యథాతథ స్థితిని పునరుద్ధరించడంలో మోడీ ప్రభుత్వం విజయవంతమవుతుందా అని ప్రజలు ఎదరు చూస్తున్నారని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి భారతదేశ వాదనను గట్టిగా నొక్కి, “యథాతథ స్థితిని” పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తుందా? అంటూ ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.