FbTelugu

ఒక్కసారిగా కొండెక్కిన చికెన్ ధర

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా చికెన్ ధరకు రెక్కలొచ్చాయి. సామాన్యులు చికెన్ కొనే పరిస్థితి లేనంతగా చికెన్ ధరలు పెరిపోయాయి. ప్రస్తుతం చికెన్ ధర రూ.250 పైకి ఎగబాకింది. ఈ స్థాయిలో వేసవిలో ఎన్నడూ చికెన్ ధరలు పెరగలేదు. అటు ఏపీలోనూ నిన్న ఘరిష్ట స్థాయిలో చికెన్ ధరలు పెరిగినట్టుగా తెలుస్తోంది.

వేసవిలో చికెన్ కేజీ ధర రూ.256 పెరిగి ఆల్ టైం రికార్డును బద్దలు కొట్టింది. చికెన్ పై కరోనా ప్రభావం పడిందని చెప్పవచ్చు.. మొదట్లో చికెన్ తింటే కరోనా వస్తుందన్న పుకార్లతో ప్రజలెవరూ చికెన్ తినడం మానేశారు. దీంతో పౌల్ట్రీ ఒక్కసారిగా కుదేలైంది. అప్పటి నుంచి పౌల్ట్రీ కోలుకోవడం లేదనే చెప్పవచ్చు.

You might also like