FbTelugu

చెన్నై కింగ్స్ లో పది మందికి కరోనా?

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ను కరోనా వైరస్ వెంటాడుతోంది. బౌలర్ మొదలుకుని స్టాఫ్ మెంబర్స్ వరకు మొత్తం పది మందికి సోకింది. దీంతో మిగతా సభ్యులు బిక్కుబిక్కుమంటున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీట్ (ఐపీఎల్) లో భాగంగా యూఏఈ కు అందరి కన్నా ముందే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం అక్కడికి చేరుకున్న టీమ్ సభ్యులు ఇవాళ ప్రాక్టీస్ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. పది మంది కి వైరస్ నిర్థారణ కావడంతో ప్రాక్టీస్ వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం ఆరు రోజుల క్వారంటైన్ కూడా పూర్తి చేసుకున్నారు.

వచ్చే నెల 19వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నందున అప్పటి వరకు ఇంకా ఎంత మంది కరోనా బారిన పడతారోనన్న బెంగ మొదలయ్యింది. మిగతా టీమ్ లు కూడా ఈ వార్త విని ఒకింత ఆందోళనకు గురయ్యారు.

You might also like